తలనొప్పికి సింపుల్ చిట్కాలివే.!

- August 07, 2023 , by Maagulf
తలనొప్పికి సింపుల్ చిట్కాలివే.!

తలనొప్పిని చాలా ఆఫ్ర్టాల్ సమస్యగా చూస్తారు చాలా మంది. కానీ, తనదాకా వస్తే కానీ తలనొప్పి బాధ తెలీదంటారు. అవును నిజమే.! తలనొప్పి పైకి తెలియని అత్యంత దారుణమైన సమస్యే. కొన్నిసార్లు వచ్చే తలనొప్పి పెయిన్ కిల్లర్స్ వేయగానే తగ్గిపోతుంది. 

కానీ, కొన్నిసార్లు తగ్గదు. కొన్ని సమయాల్లో వచ్చిన తలనొప్పి ఓ పట్టాన తగ్గదు. పెయిన్ కిల్లర్ పవర్ వున్నంత వరకూ తగ్గుతుంది. మళ్లీ మొదలవుతుంటుంది. ఇలాంటి తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే, కొన్ని వంటింటి చిట్కాలు చేస్తే ఫలితం వుంటుందని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్క తలనొప్పికి మంచి ఔషధంగా పని చేస్తుంది. దాల్చిన చెక్క పొడి చేసి వేసిన టీని వేడి వేడిగా తాగితే, తలనొప్పి తగ్గుతుంది. అలాగే, దాల్చిన చెక్క పొడిలో కాస్త గంధం పొడి కలిపి తలపై పట్టులా వేసినా ఫలితం వుంటుంది. 

అల్లం రసం కూడా తలనొప్పికి బాగా పని చేస్తుంది. అలాగే, పుదీనా, లవంగం వేసి మరిగించిన నీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా తీవ్రమైన తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com