కమెడియన్ వేణు బాటలోనే హైపర్ ఆది.?
- August 08, 2023
నవ్వుల ప్రోగ్రామ్ జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వేణు ఇటీవల ‘బలగం’ సినిమా ద్వారా డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటూ, డైరెక్టర్‌గా వేణు పనితనం గురించి కూడా సినీ వర్గాల్లో మంచి టాక్ వినిపించింది.
ఇప్పుడు వేణు, ఓ బిగ్ ప్రాజెక్ట్ టేకప్ చేశాడనీ తెలుస్తోంది. ఆ సంగతి అటుంచితే, తాజాగా హైపర్ ఆది కూడా త్వరలోనే మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నాడట. మెగా కాంపౌండ్ హీరోని ఆది డైరెక్ట్ చేయబోతున్నాడనీ తెలుస్తోంది.
అయితే, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావల్సి వుంది. ఆది మంచి రైటర్. పంచ్ డైలాగులు పేల్చడంలో అతినికి అతనే సాటి. ప్రస్తుతం బుల్లితెరతో పాటూ, పెద్ద తెర పైనా రైటర్‌గా బిజీగా వున్నాడు ఆది. మెగా ఫ్యామిలీకి భక్తుడు. ఇటు చిరంజీవిని కానీ, అటు పవన్ కళ్యాణ్‌ని కానీ ఎవరైనా ఏమైనా అంటే చాలు తనదైన పంచులతో పవర్ పంచ్ ఇస్తుంటాడు ఆది.
ఈ రకంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆది త్వరలోనే డైరెక్టర్ అయిపోనున్నాడనీ తెలుస్తోంది. తొలి సినిమాగా మెగా కాంపౌండ్ హీరోనే లైన్లో వున్నాడనీ తెలుస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









