సినిమాల్లేకపోయినా ఈ తెలుగమ్మాయ్ అక్కడ తెగ పాపులర్.!

- August 08, 2023 , by Maagulf
సినిమాల్లేకపోయినా ఈ తెలుగమ్మాయ్ అక్కడ తెగ పాపులర్.!

సినిమాల్లో నటిస్తే ఏమొస్తుంది.? సక్సెస్ అయితేనే ఫేమ్. దురదృష్టవశాత్తూ ఫెయిలైతే ఇక అంతే సంగతి అడ్రస్ గల్లంతే. కొన్నిసార్లు సక్సెస్ అయినా ఒకటీ అరా అవకాశాలకే పరిమితమైపోవాల్సి వస్తోంది. అయితే, ఓటీటీలో అలా కాదు. 

హిట్, ఫట్ అనే తేడా లేకుండా ఓటీటీ జనం ఆదరిస్తున్నారు. తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాళ్లకు ఇప్పుడు అలాంటి రెస్పెక్టే దక్కుతోంది. సినిమాల్లో అంతంత మాత్రం అవకాశాలు దక్కించుకుంటున్న శోభిత, ఓటీటీలో మాత్రం బిజీగా గడుపుతోంది.

ఇప్పటికే మూడు నాలుగు వెబ్ సిరీస్‌లు చేసింది. అందులో ఒకటి ‘మేడ్ ఇన్ హెవెన్’. మొదటి సిరీస్ ఆల్రెడీ హిట్టయ్యింది. ఇక రెండో సీజన్ ఈ నెల 10 నుంచి స్ర్టీమింగ్ కాబోతోంది ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్‌లో. 

ఈ సిరీస్‌ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. మొదటి సీజన్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ఈ సీజన్‌ని మరింత శక్తివంతంగా తెరకెక్కించామని మేకర్లు చెబుతున్నారు. వెడ్డింగ్ ప్లాన‌ర్‌గా నటించిన శోభిత ధూళిపాళ్ల పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో సీజన్‌లో ఆమె పర్‌ఫామెన్స్ వేరే లెవల్ అనేలా వుండోబోతందట. ఈ సీజన్ కూడా హిట్టయితే, శోభిత పేరు మార్మోగిపోతుంది మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com