బాగ్దాద్ లో వరుస బాంబు పేలుళ్లు: 63 మంది మృతి
- May 17, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం మంగళవారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో సుమారు 63 మంది మరణించగా... 50 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు. బాగ్దాద్ నగరం ఉత్తర ప్రాంతమైన షబాబ్ లో ఓ మహిళ జరిపిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించారు.
అలాగే రషీద్ ప్రాంతంలో కారు బాంబు పేలుడులో మరో ముగ్గురు మరణించారని చెప్పారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. కాగా ఇరాక్ లో గత కొన్ని రోజులుగా ఇస్లామిక్ స్టేట్ జిహాద్ గ్రూప్ ఇటువంటి దాడులకు పాల్పడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆ సంస్థే ఈ దారుణానికి పాల్పడి ఉండ వచ్చని సందేహం వ్యక్తం చేశారు. సదరు సంస్థ గత ఆరు రోజులుగా జరిపిన బాంబు పేలుళ్లలో 100 మంది దుర్మరణం పాలైయ్యారని పేర్కొన్నారు. గత గురువారం ఉత్తర బాగ్దాద్ లో కారు బాంబు పేలి.. 94 మంది మరణించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









