భారత స్వాతంత్ర్య దినోత్సవం. లులూ హైపర్‌మార్కెట్ లో భారీ తగ్గింపులు
- August 12, 2023
కువైట్: ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ రిటైలర్ అయిన లులూ హైపర్‌మార్కెట్ వారం రోజుల పాటు ‘స్వాతంత్ర్య దినోత్సవం’ ప్రమోషన్‌ను నిర్వహిస్తుంది. ఆగస్టు 9 నుండి 15 వరకు జరిగే ఈ ప్రమోషన్లో హైపర్‌మార్కెట్‌లోని అల్-రాయ్ అవుట్‌లెట్‌లో ఆగస్టు 10న భారత రాయబారి హెచ్.ఇ. ఆదర్శ్ స్వైకా ఉత్సవాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో దేశంలోని భారతీయ పాఠశాలల విద్యార్థుల రంగుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం భారతీయ కళలను ప్రదర్శించడంలో అద్భుతంగా కృషి చేసిన కళాకారులకు రాయబారి స్వైకా జ్ఞాపికలను అందజేశారు. వారం రోజుల పాటు జరిగే ప్రమోషన్ లో షాపర్లకు అనేక రకాల భారతీయ బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు, ఆఫర్లను అందిస్తుంది. ప్రమోషన్ సందర్భంగా హైపర్ మార్కెట్ ఫోయర్‌లో ‘ఫ్యూచర్ ఇండియా’ థీమ్ పేరిట భారీ కటౌట్లు, చారిత్రాత్మక భారతీయ స్మారక చిహ్నాలు, ల్యాండ్‌మార్క్‌ల చిత్రాలను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







