ఒమన్‌లోని పలు గవర్నరేట్‌లలో భారీ వర్షాలు..
- August 12, 2023
మస్కట్: 2023 ఆగస్టు 11వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఒమన్ సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్‌లలో20-35 మిమీల మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముసందమ్, అల్ బురైమి, అల్ దహిరా, అల్ దఖిలియా, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా మరియు నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌ల పర్వత ప్రాంతాలు భారీ వర్షాలు కురిసే ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంది. వర్షాలు కురిసే సమయంలో 20-45 నాట్ల దిగువన వీచే గాలులు ఉంటాయని, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని, లోయలు పొంగిపొర్లుతున్న సమయంలో దుమ్ము తుఫానుల వచ్చే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోయల్లో ఈత కొట్టేందుకు ప్రయత్నించవద్దని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







