నిఖిల్‌తో జత కట్టనున్న సంయుక్త.!
- August 16, 2023
యంగ్ హీరో నిఖిల్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది అందాల భామ సంయుక్త మీనన్. ‘కార్తికేయ 2’ సినిమాతో నిఖిల్ ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘కార్తికేయ 2’ తర్వాత ‘18 పేజెస్’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు నిఖిల్ సిద్దార్ధ.
అయితే, ఇటీవల వచ్చిన ‘స్పై’ మూవీ నిఖిల్‌ని నిరాశ పరిచిందనే చెప్పాలి. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. అంచనాలు బాగానే క్రియేట్ చేసినా, రిలీజ్ తర్వాత తుస్సుమంది.
ఇక, ఇప్పుడు కొత్త డైరెక్టర్ భరత్ కృష్ణమాచారితో నిఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ‘స్వయంభు’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం తాజాగా హీరోయిన్ పేరు ఫిక్స్ చేశారు.
‘విరూపాక్ష’తో సూపర్ సక్సెస్ అందుకున్న సంయుక్త, ప్రస్తుతం స్టార్ ఛైర్ దిశగా దూసుకొస్తోంది. అయితే, ఆచి తూచి అడుగులేస్తోంది. ఏది పడితే అది కాకుండా.. ఇంపార్టెన్స్ వున్న రోల్స్‌ని ఎంచుకుంటోంది. ఆ క్రమంలోనే నిఖిల్ సిద్దార్ధ్ కొత్త సినిమా ‘స్వయంభు’ లో ఎంపికైంది. చూడాలి మరి, ‘స్వయంభు’తో సంయుక్త మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందేమో.!
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







