గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకం!
- May 17, 2016
శంకర్ బిదిరి వెల్లడి బెంగళూరు : గంధపు చెక్కల దొంగ వీరప్పన్ అట్టహాసంపై త్వరలో పుస్తకాన్ని వెలువరించనున్నట్లు విశ్రాంత పోలీసు ప్రధానాధికారి శంకర్ బిదిరి వెల్లడించారు. మరో మూడు నెలల్లోగా పుస్తకం చదువరులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఆయన మంగళవారం బెంగళూరులో ఓ ప్రైవేట్ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వీరప్పన్‌కు సంబంధించి ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలిసిన సమాచారం కేవలం 20 శాతమేనని- తాను రచించనున్న పుస్తకంలో పూర్తి సమాచారం ఉంటుందన్నారు. వీరప్పన్ కోసం వేటలో పాల్గొన్న పోలీసు అధికారుల అనుభవాలు, వైఫల్యాల్ని కూడా అందులో పొందుపరుస్తానని చెప్పారు. ఆయన ఆటకట్టించేందుకు అప్పట్లో ఏర్పాటైన ప్రత్యేక పోలీసు దళానికి బిదిరి కొంతకాలం నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







