శ్రీవారి ఆలయం సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ...

- May 17, 2016 , by Maagulf
శ్రీవారి ఆలయం సమీపంలో  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ...

శ్రీవారి ఆలయం సమీపంలో బుధవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కేబుల్స్ అంటుకుని మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆలయాన్ని కమ్మేసింది. ఒకవైపు వర్షం కురుస్తుండగా మరోవైపు దట్టమైన పొగ కమ్మేయడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఆలయానికి విద్యుత్ సరఫరా జరిగే కేబుళ్లలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చిన విషయం గుర్తుంచి కేబుళ్లను సరిచేశారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సక్రమంగా జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com