తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత
- August 17, 2023
తిరుమల: తిరుమలలో చిరుతల కలకలం సద్దుమణగట్లేదు. ఈరోజు మరో చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో, ఆ చిరుతను బంధించేందుకు అధికారులు దాడి జరిగిన పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేయగా మరుసటి రోజే ఓ చిరుత చిక్కింది. ఆ తరువాత కొన్ని రోజులకే నేడు మరో చిరుత అధికారులకు చిక్కింది.
తిరుమలలో పలు చిరుతలు సంచరిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వాటిని పట్టుకునేందుకు అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో, ఈ తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది.
కాగా, మెట్లమార్గంలో భక్తులకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలన్న సూచన అమలు చేయడం కుదరదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిరుతల స్వేచ్ఛా సంచారానికి కంచె ఏర్పాటుతో అడ్డంకి సృష్టించినట్టు అవుతుందని వివరించారు. చిరుతలన్నీ పెద్దవే కావడంతో కంచెను దాటి కూడా అవి దాడి చేయగలవని చెప్పారు.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్‌కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







