మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం
- May 18, 2016
జమ్ముకశ్మీర్‌లోని రేసీ జిల్లాలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. త్రికుల హిల్స్‌లోని అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు.సీఆర్‌పీఎఫ్ అధికారులు రంగంలోకి దిగి.. మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ఆలయానికి కొంత దూరంలో మంటలు చెలరేగుతుండటంతో .. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ల సాయంతో యాత్రికులకు అటవీప్రాంతానికి దూరంగా ఉన్న వైష్ణోదేవి యూనివర్శిటీ క్యాంపస్‌కు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









