ఆన్‌లైన్ మోసాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక
- August 18, 2023
కువైట్: ఆన్ లైన్ మోసాలపై కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వివిధ సందేహాస్పద సంస్థలు ఆన్‌లైన్‌లో మంత్రిత్వ శాఖ ప్రతినిధులుగా పేర్కొంటూ వినియోగదారులను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని హెచ్చరించింది. వెబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నకిలీ మంత్రిత్వ శాఖ ఖాతాలను ఉపయోగించే స్కామర్ల కారణంగా పౌరులు, నివాసితులపై మోసపూరిత చర్యలు పెరుగుతున్నాయని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో చట్టపరమైన మార్గాల ద్వారా మోసగాళ్లను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు.. నకిలీ సైట్లు, ఖాతాలను బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నది. పౌరులు మరియు నివాసితులు నకిలీ ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని, వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) లేదా బ్యాంక్ డేటా కోసం అడిగే సందేశాలకు, కాల్స్ ప్రతిస్పందించకూడదని సూచించింది. సహెల్ అప్లికేషన్‌లో అన్ని మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







