టైగర్ సాహసాలు.! మాస్ రాజాకి ఈ సారైనా.!
- August 18, 2023
‘ధమకా’తో సూపర్ హిట్టు కొట్టి, ‘వాల్తేర్ వీరయ్య’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘నరకాసుర’ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది.
ఇక, ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
కాగా, ఈ లోపు సినిమా టీజర్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేసింది ‘టైగర్ నాగేశ్వరరావు’ అండ్ టీమ్. టీజర్ ప్రామిసింగ్‌గా వుంది. కరడుగట్టిన దొంగ స్టూవర్ట్‌పురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథాంశం ఆధారంగా ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.
టైటిల్ రోల్ పోషిస్తున్నాడు మాస్ రాజా రవితేజ. స్టూవర్ట్ పురం దొంగలా రకరకాల గెటప్స్‌లో డిఫరెంట్ సాహసాలు చేస్తూ కనిపిస్తున్నాడు రవితేజ ఈ సినిమాలో. పవర్ ఫుల్ యాక్షన్‌తో పాటూ, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో వుండబోతున్నాయని తెలుస్తోంది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా, పవన్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









