బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..

- August 18, 2023 , by Maagulf
బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..

హైదరాబాద్: తెలంగాణలో అప్పుడే ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ వెలువడనే లేదు అప్పుడే పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేశాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ దూకుడు మీదుంది. సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. బీఆర్ఎస్ గెలుపు గుర్రాలను రెడీ చేసేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైపోయింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 21న తొలి జాబితా విడుదల చేయనున్నారు. తొలి జాబితాలో ఏకంగా 96మంది అభ్యర్థులను ప్రకటించే చాన్సుంది. మూడు రోజులుగా ప్రగతిభవన్ లో హరీశ్ రావు, కేటీఆర్ లతో కేసీఆర్ చర్చలు జరిపారు. 10, 12 మంది సిట్టింగ్ లు మినహా అందరికీ మరో ఛాన్స్ ఇవ్వనున్నారు. వివాదాల్లో కూరుకుపోయిన సిట్టింగ్ లకు మినహా అందరికీ అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. కొత్త ఆశావహులకు మరోసారి భంగపాటు కలిగే అవకాశముంది.

జనగామ ఎమ్మెల్యే – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి (స్థానికంగా తీవ్ర వ్యతిరేకత, తీవ్ర అవినీతిపరుడు అంటూ సొంత కూతురి ఆరోపణలు)
జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి దక్కే చాన్స్

స్టేషన్ ఘనపూర్ – ఎమ్మెల్యే రాజయ్య (మహిళా సర్పంచ్ తీవ్ర ఆరోపణలు, కడియం శ్రీహరితో విబేధాలు)
స్టేషన్ ఘనపూర్ టికెట్ కడియం శ్రీహరికి లేదా ఆయన కూతురు కడియం కావ్యకు ఇచ్చే అవకాశం
వారసులకు చాన్స్ ఇచ్చే అవకాశం లేదని సమాచారం.

మునుగోడు- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (వామపక్షాలకు కేటాయించే అవకాశం)

చొప్పదండి – ఎమ్మెల్యే రవిశంకర్(ఆరోపణలు, సొంత పార్టీలోనే అసమ్మతి) ఈసారి టికెట్ ఇవ్వడం డౌటే

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కి చొప్పదండి టికెట్ ఇచ్చే అవకాశం(బాల్క సుమన్ సొంత జిల్లా ఉమ్మడి కరీంనగర్)
చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకు ఇచ్చే అవకాశం.(వెంకటేశ్ నేత సొంతూరు చెన్నూరు)

ఖానాపూర్ – ఎమ్మెల్యే రేఖానాయక్ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా నాయక్, సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత, కొత్త అభ్యర్థిగా జాన్సన్ నాయక్, అసమ్మతి వర్గీయుల మద్దతు జాన్సన్ నాయక్ కే)

కల్వకుర్తి – జైపాల్ యాదవ్ (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది కల్వకుర్తి. పార్టీ శ్రేణుల్లో యాదవ్ పై అసంతృప్తి)

జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు(టికెట్ వచ్చే అవకాశం లేదు.. టికెట్ ఆశిస్తున్న వ్యక్తులు ఎర్రోళ్ల శ్రీనివాస్(ఉద్యమకారుడు), ఢిల్లీ వసంత్, నరోత్తం(కాంగ్రెస్ నుంచి వచ్చారు).

మంచిర్యాల – ఎమ్మెల్యే దివాకర్ రావు( పరిశీలినలో రామ్మోహన్ రావు పేరు)

ఉప్పల్ – బేతి సుభాష్ రెడ్డి( టికెట్ ఆశిస్తున్న లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్)

అంబర్ పేట్ – ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్( ఎడ్ల సుధాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చు)

మహబూబా బాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్(ఉమ్మడి వరంగల్ జిల్లా, చాలాసార్లు వివాదాస్పదం అయ్యారు. నాయక్ ను తప్పిస్తే సత్యవతి రాథోడ్ లేదా ఎంపీగా ఉన్న కవిత బరిలోకి దిగే చాన్స్)

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ (పౌరసత్వం వివాదంలో చెన్నమనేని రమేశ్.. విద్యాసంస్థల అధిపతి చెలిమడ నరసింహారావుకి టికెట్ ఇచ్చే అవకాశం)

కామారెడ్డి- మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఎమ్మెల్యేని మార్చే ఆలోచన. గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్.. కామారెడ్డి నుంచి బరిలోకి దిగే అవకాశం, కామారెడ్డిలో పెద్ద ఎత్తున సర్వేలు.)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com