ఒత్తిడి అంత ప్రమాదమా.?

- August 18, 2023 , by Maagulf
ఒత్తిడి అంత ప్రమాదమా.?

అధిక బరువే కాదు.. అకస్మాత్తుగా బరువు కోల్పోవడం కూడా ఓ అనారోగ్య సమస్యగానే పరిగణిస్తున్నారు వైద్య నిపుణులు. వ్యాయామాలు చేయడం, అధికంగా వాకింగ్ గట్రా చేసి, అధిక బరువు తగ్గించుకోవడం ఓ ఎత్తు. దీనివల్ల గ్రాడ్యువల్‌గా బరువు తగ్గుతుంటారు.

అయితే, ఎలాంటి వ్యాయామాలూ చేయకుండానే కొన్ని సమయాల్లో సడెన్‌గా బరువు తగ్గిపోతుంటారు. అందుకు కారణం క్యాన్సర్ కణితులు వృద్ధి చెందడం కావచ్చు. గుండె జబ్బులు పొంచి వుండే ప్రమాదం కావచ్చని సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు. 

బరువు తగ్గడానికి మరో ముఖ్య కారణం ఒత్తిడి కూడా కారణంగా చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా బరువు సమస్యలు రెండు రకాలు. కొన్ని సార్లు అధికంగా బరువు పెరిగే అవకాశాలున్నాయ్. 

అలాగే, అకస్మాత్తుగా బరువు తగ్గే అవకాశాలూ వున్నాయ్ ఇలా రెండు రకాలుగా ఒత్తిడి మన బరువుపై అజమాయిషీ చేస్తుంటుంది. అయితే, కారణం ఏదైనా సరే, అకస్మాత్తుగా బరువు తగ్గడం అనేది భవిష్యత్తులో తీవ్రమైన అనారోగ్య సమస్యగా పరిణమించే ప్రమాదమున్నట్లు హెచ్చరిస్తున్నారు.

సో, అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నారన్న అనుమానం కలగగానే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సలహా తీసుకుని తగిన మందులు వాడాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com