ఖతార్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు అరెస్ట్
- August 19, 2023
దోహా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లోని అనేక మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అక్రమార్జన, విధులను దుర్వినియోగం చేయడం, ప్రజా ధనానికి నష్టం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. నిందితులకు వ్యతిరేకంగా అవసరమైన సాక్ష్యాలను సేకరించిన తర్వాతనే వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు తెలిపింది. 2004 నాటి చట్టం నెం. 11లోని ఆర్టికల్ 148 ప్రకారం.. ప్రభుత్వ అధికారిగా ఉండి తన ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి అతని వద్ద ఉన్న డబ్బు, కాగితాలు లేదా ఇతరులను అపహరించిన వ్యక్తికి 5-10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. అదే నిధులను దుర్వినియోగం చేయడం, తన స్వార్థానికి వాడుకోవడం లాంటి నేరాలకు పాల్పడిన సందర్భంగా 7-15 ఏళ్ల మధ్య జైలుశిక్ష, నిధుల రికవరీతోపాటు భారీ జరిమానావిధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







