కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ను ప్రకటించిన దుబాయ్
- August 19, 2023
దుబాయ్: కొత్త ఎంట్రీ పర్మిట్ సిస్టమ్ ను దుబాయ్ ప్రకటించింది. GCC నివాసితుల కోసం దుబాయ్ ఆన్‌లైన్ ఎంట్రీ పర్మిట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. GCC నివాసితులు ఇప్పుడు యూఏఈ ప్రవేశ అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-దుబాయ్ (GDRFA) వెల్లడించింది.
GDRFA ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కొత్త ప్రవేశ అనుమతి కోసం అవసరమైన పత్రాల వివరాలను పేర్కొంది. అసలు పాస్‌పోర్ట్, GCC దేశం జారీ చేసిన అసలు నివాస అనుమతి పత్రం, పౌర లేదా లేబర్ కార్డ్ అవసరం అవుతాయి. GDRFAD వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ను పూర్తి చేసి ఫీజు చెల్లించాలి. దీనికి VAT (5 శాతం)తో AED250 ఖర్చవుతుంది. అయితే, GCC నివాసి తప్పనిసరిగా కొన్ని షరతులను పాటించాలి. విదేశీయుడు కనీసం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే నివాస అనుమతిని కలిగి ఉండాలి. ప్రయాణికుడిని దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఆంక్షలు ఉండకూడదు. పని లేదా రెసిడెన్సీ కార్డ్‌లో వృత్తిని చేర్చాలి. కొత్త సేవలు 24 గంటలు.. వారానికి 7 రోజులు అందుబాటులో ఉంటాయి. కనీసం 48 గంటల ప్రాసెసింగ్ సమయం పడుతుందని GDRFA తన పోస్ట్ లో వివరించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







