ఒమన్‌లో నవంబర్ లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
- August 20, 2023
మస్కట్: ఈ ఏడాది రెండో ఎడిషన్‌లో అల్ బతినా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తేదీలను వెల్లడించారు. "హ్యుమన్ రిలేషన్ షిప్ విత్ ల్యాండ్" అనే నినాదంతో నవంబర్ 12-15 వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఇందులో ఒమానీ మరియు అంతర్జాతీయ లఘు కథన చిత్ర పోటీ, ఒమానీ మరియు అంతర్జాతీయ షార్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ పోటీలు ఇతర కార్యక్రమాలను షెడ్యూలో పేర్కొన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కోసం కొత్త పోటీని ప్రకటించారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్, మానవవిలువలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన డాక్యుమెంటరీలను ఆహ్వానిస్తున్నట్లు ఫెస్టివల్ అధినేత డాక్టర్ హమీద్ అల్ అమెరి తెలిపారు. సమాజంలో సినిమా సంస్కృతిని వ్యాప్తి చేయడం, అంతర్జాతీయ సినిమా పరిశ్రమకు భవిష్యత్ ఫ్రంట్‌గా ఒమన్ సుల్తానేట్ను ప్రచారం చేయడం ఈ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యమన్నారు. ఫెస్టివల్ లో పాల్గొనాలనుకునే వారు అక్టోబర్ 1 వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు









