భారత ఎంబసీ మిషన్ లైఫ్ ప్రచారం సక్సెస్
- August 22, 2023
మస్కట్: వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి) చొరవలో భాగంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం వారం రోజుల పాటు నిర్వహించిన అవగాహన ప్రచారం విజయవంతంగా ముగిసింది. ఆగస్ట్ 13 నుండి ఆగస్ట్ 19 వరకు సాగిన ఈ ప్రచారంలో వ్యర్థ వినియోగం నుండి వనరుల వినియోగంపై అవగాహన కల్పించారు. దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించడం ద్వారా వాతావరణ మా, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పర్యావరణ ఔత్సాహికులు, ఒమన్‌లోని భారతీయ సంఘంలోని ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. ఈ మిషన్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించడంతోపాటు రాయబారి హెచ్.ఇ. అమిత్ నారంగ్ తన ప్రసంగంలో వాతావరణ మార్పులను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను, ఈ లక్ష్యాన్ని సాధించడంలో మిషన్ లైఫ్ పాత్రను వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







