జోరు పెంచిన నితిన్.!

- August 22, 2023 , by Maagulf
జోరు పెంచిన నితిన్.!

మొన్నీ మధ్యనే ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి హీరో నితిన్ షాకిచ్చాడు. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్‌లో నితిన్ కనిపించబోతున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, తాజాగా మరో కొత్త సినిమానీ సెట్స్ మీదికి తీసుకెళ్లబోతున్నాడు నితిన్. ఈ నెలాఖరుకే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1న రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

‘వకీల్ సాబ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.  

అక్క, తమ్ముడి సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా కథ వుండబోతోందనీ తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేకంగా వుండబోతున్నాయనీ సమాచారం.

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రూపంలో నితిన్‌ని ఓ పెద్ద డిజాస్టర్ వెంటాడింది ఈ మధ్య. ఈ డిజాస్టర్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఓ మంచి హిట్ పడాల్సిందే. చూడాలి మరి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. ఏ సినిమాతో సూపర్ హిట్ కొడతాడో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com