రేపు ఎన్నికల సంఘంతో సచిన్ ఒప్పందం
- August 22, 2023
న్యూఢిల్లీ:ఎన్నికల సంఘం లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది. బుధవారం దీనిపై ఒప్పందం కుదరనున్నది. రాబోయే ఎన్నికల్లో యువతకు ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు సచిన్ పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సచిన్ ఓటర్ల చైతన్య ప్రచారం నిర్వహిస్తారని ఈసీ తెలిపింది. అనేక రంగాలకు చెందిన మేటి వ్యక్తుల్ని నేషనల్ ఐకాన్స్‌గా ఈసీ తమ ప్రచారం కోసం నియమించుకుంటోంది. గతంలో పంకజ్ త్రిపాఠి, ఎంఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్, మేరీ కోమ్‌లను కూడా ఎన్నికల ప్రచారం కోసం ఈసీ వాడుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







