ప్రపంచ వేదిక పై భారత్‌కు ఎదురుదెబ్బ..
- August 24, 2023
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)కు ప్రపంచ వేదికగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. . భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రద్దు చేసింది. ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ వెల్లడించింది. డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ‘డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించనందుకు గానూ సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు యూడబ్ల్యూడబ్ల్యూ.. డబ్ల్యూఎఫ్ఐ అడహాక్ కమిటీకి బుధవారం రాత్రి సమాచారం ఇచ్చింది’ అని భారత ఒలిపింక్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ నిర్ణయంతో ఇండియన్ రెజ్లర్లు రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున పాల్గొనే వీలుండదు. సెప్టెంబరు 16 నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీ జరగనుంది. అయితే ప్రస్తుతం వరల్డ్ ఛాంపియన్ షిప్ లో పోటీ పడే అవకాశం లేకపోవడంతో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్లు’గా పోటీపడాల్సి ఉంటుంది. భారత్ ట్యాగ్‌లైన్ లేకుండానే వారు ఆడాల్సి వస్తుంది.
ఇటీవలే మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ షరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో డబ్ల్యూఎఫ్ఐ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శరణ్ సింగ్‌ను పదవి నుంచి తప్పించాలని మహిళా రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రద్దు చేసింది. ఆ తర్వాత WFI కార్యకలాపాల నిర్వహణను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. ఆగస్టు 27న ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి 45 రోజుల్లోగా WFI ప్యానెల్‌కు ఎన్నికలు నిర్వహించాలి. గడువులోగా ఎన్నికలు పూర్తి చేయాలని, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదని ఏప్రిల్ 28న యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించింది. అప్పటి నుంచి ఎన్నికలు ఎన్నిసార్లు నిర్వహించాలని చూసినా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సభ్యత్వాన్ని సస్పండ్ చేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









