వివిధ పథకాల లబ్ధిదారులకు రూ.216.34 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం జగన్
- August 24, 2023
అమరావతి: ఏపీలో వివిధ పథకాల లబ్ధిదారులకు నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు గురువారం సీఎం జగన్ పలు పథకాల లబ్ధిదారులకు నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 2,69,169 మంది లబ్ధిదారులకు రూ.216.34 కోట్ల నిధులను విడుదల చేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ లంచం, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న తపన, తాపత్రయంతో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. లబ్ధిదారులకు మంచి జరగాలని, ప్రభుత్వం ఇంకా ప్రజలకు మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
5వేల నాలుగు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటికి కూడా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక నాయకులు వెళ్లి జల్లెడ పట్టి ఏ ఒక్కరూ మిగిలి పోకూడదని జగనన్న సురక్ష కార్యక్రమాన్ని బాధ్యత తీసుకున్నారని పేర్కొన్నారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా 94 లక్షల 62 వేల 184 రకరకాల సర్టిఫికేట్లు ఇచ్చారని తెలిపారు. అర్హులుగా ఉన్న 12 వేల 405 మందిని గుర్తించి దరఖాస్తు చేయించి వారికి జగనన్న సురక్ష పథకాన్ని వర్తింప చేశామని తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









