లైసెన్స్ లేని హోటల్స్ పై కఠిన చర్యలు
- August 24, 2023
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) గెస్ట్‌హౌస్‌లు, హోటళ్ల లైసెన్స్ లేని యజమానులు తమ సంస్థలకు టూరిజం లైసెన్సులను తీసుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లైసెన్స్ లేని గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లు మరియు హోమ్‌స్టేలను క్రమబద్ధీకరించడానికి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ప్రచారం నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. అతిథులు, సందర్శకులకు నాణ్యమైన సేవలను నిర్వహించడానికి యజమానులు మంత్రిత్వ శాఖ నుండి లైసెన్సులను పొందేలా ఈ ప్రచార లక్ష్యంగా ఉందని తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ఒమన్‌లో 1,700 కంటే ఎక్కువ లైసెన్స్ లేని పర్యాటక సంస్థలు ఉన్నట్టు అంచనా. పర్యాటక రంగాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు అక్రమాలను తనిఖీ చేయడానికి మంత్రిత్వ శాఖ ‘క్వాలిటీ బిగిన్స్ విత్ లైసెన్సింగ్’ పేరుతో నెల రోజుల పాటు అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









