బ్యాక్-టు-స్కూల్ క్యాంపెయిన్ ప్రారంభం
- August 25, 2023
దోహా: Mowasalat (కర్వా) సహకారంతో 'మై స్కూల్ ఈజ్ మై సెకండ్ హోమ్' అనే థీమ్‌తో బ్యాక్-టు-స్కూల్ క్యాంపెయిన్ ను ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MoEHE) గురువారం ప్రారంభించింది. మాల్ ఆఫ్ ఖతార్‌లో ఆగస్టు 24 నుండి 29 వరకు ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. శుక్రవారం మరియు శనివారం (సాయంత్రం 4 నుండి రాత్రి 9 వరకు), ఆదివారం, సోమవారం మరియు బుధవారం (మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 వరకు) పాఠశాలల్లో నేర్చుకునే వాతావరణం కోసం విద్యార్థులను సిద్ధం చేసే కార్యక్రమాలు, వివిధ వినోద కార్యక్రమాలను చేపట్టనున్నారు. MOEHE యొక్క పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మర్యం అబ్దుల్లా అల్ మొహన్నాడి మాట్లాడుతూ.. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులను, ముఖ్యంగా ప్రాథమిక మరియు బాల్య దశల్లో ఉన్నవారిని, వివిధ రకాల విద్యల ద్వారా సిద్ధం చేయడమే ఈ ప్రచారం లక్ష్యమన్నారు. కార్వా అకాడమీ డైరెక్టర్, ఫైసల్ అల్ నుయిమి మాట్లాడుతూ.. ప్రతి కొత్త విద్యా సంవత్సరానికి ముందు ఇలాంటి క్యాంపెయిన్ ను నిర్వహిస్తామని, విద్యార్థులతో నడుచుకునే విధానాలపై పాఠశాల బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతిరోజూ వేలాది పాఠశాల బస్సులు దాదాపు 60 వేల మంది విద్యార్థులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తాయని అల్ నుయిమి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







