వరుణ్ తేజ్ ఈ సారైనా.!
- August 25, 2023
ఈ శుక్రవారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విలక్షణ కథల్ని ఎంచుకుంటూ, సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా దూసుకెళుతోన్న వరుణ్ తేజ్‌కి ఓ మంచి హిట్ పడాల్సిన అవసరం వుంది ప్రస్తుత నేపథ్యంలో.
ఎందుకంటే, గత కొంత కాలంగా వరుణ్ తేజ్‌కి సరైన హిట్టు లేదు. సో, తన స్టామినా నిలబెట్టుకోవాలంటే, ఈ సారి రాబోయే సినిమాతో మినిమమ్ గ్యారంటీ హిట్ అయినా పడాల్సిందే.
‘గాంఢీవధారి అర్జున’ విషయానికి వస్తే, పబ్లిక్ టాక్ పాజిటివ్‌గానే వుంది. కానీ, ఎందుకో ఆశించదగ్గ బజ్ క్రియేట్ కాలేదు ఈ సినిమాపై. ప్రమోషన్లు కూడా వీక్‌గానే కనిపిస్తున్నాయ్.
పోస్టర్లు చూస్తుంటే, పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయ్ కానీ, కంటెంట్‌పై ఎందుకో నమ్మకం కుదరడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. లేదు లేదు, ‘గాంఢీవధారి అర్జున’ను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సీరియస్‌గా తీసుకున్నాడనీ, వరుణ్ వైపు నుంచి కాకున్నా, తన వైపు నుంచి అయినా ఈ సినిమా హిట్టు బొమ్మవుతుందన్న ధీమాతో వున్నాడనీ ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం