ముఖం పై జిడ్డు తొలగించుకోవాలంటే.!

- August 25, 2023 , by Maagulf
ముఖం పై జిడ్డు తొలగించుకోవాలంటే.!

ముఖం పై జిడ్డు కారణంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్ వేధిస్తుంటాయ్. దీంతో ముఖం అందవికారంగా మారిపోతుంటుంది. ముఖంపై జిడ్డు తొలగించిుకోవాలంటే ఏం చేయాలి.?
సింపుల్ చిట్కాల ద్వారా ముఖంపై పేరుకుపోయిన జిడ్డునూ, మృత కణాలను ఈజీగా తొలిగించుకోవచ్చు. మొదటగా చేయాల్సింది.. ముఖాన్ని ఎక్కువ సార్లు సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటూ వుండాలి.
ఇలా తరచూ చేసుకోవడం వల్ల మృత కణాలు నాశనమవుతాయ్. అలాగే, జిడ్డు కూడా కొంతవరకూ తొలిగిపోతుంది. ఇలా చేసినప్పటికీ కొందరిలో ముఖంపై జిడ్డు కణాలు అలాగే వుండిపోతాయ్.
అలాంటి వారి కోసం పెరుగుతో చిన్న చిట్కా.. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ ముఖంపై మృత కణాలను తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. 
కొద్దిగా పెరుగు తీసుకుని, అందులో పావు టీ స్పూన్ కాఫీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు వేసి ముఖానికి పేక్‌లా వేసి 20 నిముషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది.
పసుపు యాంటి సెప్టిక్‌గా పని చేస్తుంది. మొటిమల కారణంగా వచ్చిన వాపు, నొప్పిని తొలగించడంలో తోడ్పడుతుంది. అరటి పండు గుజ్జుతోనూ ముఖంపై పేరుకుపోయిన అదనపు జిడ్డును ఈజీగా తొలిగించుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com