కువైట్ వదిలేందుకు టెలిఫోన్ బిల్లు, లీగల్ బకాయిలు ఉండొద్దు..!
- August 26, 2023
కువైట్: ప్రవాసులు కువైట్ విడిచి వెళ్లే ముందు పెండింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలు, విద్యుత్ బిల్లులతో సహా ల్యాండ్‌లైన్ టెలిఫోన్ బకాయిలు, న్యాయ మంత్రిత్వ శాఖకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాల్సి ఉంటుంది. స్థానిక అరబిక్ దినపత్రిక అల్జారిడా ప్రకారం.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్ బుధవారం కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అహ్మద్ అల్-మజ్రెన్, న్యాయ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హషీమ్ అల్-కల్లాఫ్‌తో సమావేశమయ్యారు. ప్రవాసుల నుంచి బకాయిలను వసూలు చేయడానికి మూడు మంత్రిత్వ శాఖల మధ్య ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ కోసం మెకానిజంపై చర్చించారు. నివేదిక ప్రకారం, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఈ మంత్రిత్వ శాఖల నుండి బిల్లులకు సంబంధించి వచ్చే నోటిఫికేషన్లను పోర్ట్‌లతో లింక్ చేస్తుంది. ఇది ఏ ప్రవాసుడు, గల్ఫ్ పౌరుడు లేదా సందర్శకుల బిల్లులను చెల్లించకుండా దేశం విడిచి వెళ్లడానికి అనుమతించదు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఓడరేవులు, ఎయిర్ పోర్టులు సేకరణ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







