తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో కొత్త మలుపు
- May 18, 2016
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొత్త మలుపు తిరిగాయి. స్థానిక మీడియాలో జయలలితకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. పోలింగ్ చివరి 2 గంటల్లో అధికార అన్నాడీఎంకు అనుకూలంగా ఓట్లు పడ్డాయని వెల్లడించింది. అన్నాడీఎంకే ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని తంతి టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. అన్నాడీఎంకే 111, డీఎంకే 99, మూడో ఫ్రంట్ 3, పీఎంకే 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని తెలిపింది. వేదారణ్యం స్థానంలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేసింది.జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఐదు ఎగ్జిట్ పోల్స్ లో ఒకటి మాత్రమే అన్నాడీఎంకు అధిక సీట్లు వస్తాయని పేర్కొంది. మిగతా నాలుగు డీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిపాయి. అన్నాడీఎంకు 139 స్థానాలు ఖాయమని సీఓటర్-టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా కట్టింది.
కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనుకున్నట్టు రాకపోవచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ అభిప్రాయపడ్డారు. యాక్సిస్ మై ఇండియా ఫలితాలు తిరగబడొచ్చని అన్నారు. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది.పుదియ తలైమురై ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 164, డీఎంకే 66 కుముదమ్ రిపోర్టర్ ఎగ్జిట్ పోల్స్ సర్వే: అన్నాడీఎంకే 162, డీఎంకే 41, డీఎంకే 15
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







