2024 మే 14 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరమ్

- August 27, 2023 , by Maagulf
2024 మే 14 నుంచి ఖతార్ ఎకనామిక్ ఫోరమ్

దోహా: నాల్గవ వార్షిక "ఖతార్ ఎకనామిక్ ఫోరమ్, పవర్డ్ బై బ్లూమ్‌బెర్గ్ " మే 14-16, 2024 వరకు దోహాలో జరుగుతుందని ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ హయ్యర్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది. ఈ సమావేశంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రంగా చర్చించనున్నారు.   ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ హయ్యర్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, మీడియా సిటీ ఖతార్ సీఈఓ షేక్ అలీ బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్-థానీ మాట్లాడుతూ.. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రపంచ ఆలోచనాపరులు, పరిశ్రమ మార్గదర్శకులు, ప్రభావవంతమైన నిర్ణయాధికారులను ఒకచోట చేర్చే ఈవెంట్‌ అన్నారు. ఫోరమ్ ఖతార్‌కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి  ఆర్థిక సమాలోచనలను అందజేస్తుందని తెలిపారు. కు బ్లూమ్‌బెర్గ్ మీడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్కాట్ హెవెన్స్ మాట్లాడుతూ.. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభమైనప్పటి నుండి ఈ ప్రాంతం ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారిందని తెలిపారు. డైనమిక్ ఆర్థిక భవిష్యత్తును రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను సమావేశపరిచే వేదికగా ఇది నిలిచిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com