పాఠశాలలు, క్యాంపస్‌లో సోషల్ మీడియా, మొబైల్ వినియోగంపై నిషేధం
- August 30, 2023
యూఏఈ: దుబాయ్‌లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాఠశాల అవరణలో సోషల్ మీడియా అప్లికేషన్లను ఉపయోగించడంపై పాక్షిక లేదా పూర్తి నిషేధాన్ని విధించాయి. అయితే, సోషల్ మీడియా విద్యార్థుల జీవితాల్లో ఒక భాగంగా కొనసాగుతుందని ప్రధానోపాధ్యాయులు అంగీకరిస్తున్నప్పటికీ, అలాంటి ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేయడం వల్ల పాఠశాల నిబంధనలను ప్రమాదకర ఉల్లంఘనగా పరిగణించడం జరుగుతుందన్నారు. GEMS ఇంటర్నేషనల్ స్కూల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గదీర్ అబు-షమత్ మాట్లాడుతూ.. “పాఠశాలలో విద్యార్థులు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు. పాఠశాల సమయంలో సోషల్ మీడియా నిషేధించబడింది. ” అన్నారాయన.
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తమ సోషల్ మీడియా ఛానెల్‌లలో పాఠశాల నుండి చిత్రాలను పోస్ట్ చేయవలసి వస్తే అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.పాఠశాల సమావేశాలలో మరియు వర్క్‌షాప్‌ల ద్వారా సామాజిక మాధ్యమాల వినియోగంపై నిరంతరం అవగాహన కల్పిస్తామని, మార్గదర్శకాలను అందిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







