హీరో తరుణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా.?
- August 31, 2023
ఒకప్పుడు హీరో తరుణ్ అంటే ఓ సెన్సేషన్. ‘నువ్వే కావాలి’ సినిమాతో రికార్డులు కొల్లగొట్టేశాడీ హీరో. బాలనటుడిగా అప్పటి వరకూ తెలుగు ప్రేక్షకుల మన్ననలందుకున్న తరుణ్, హీరోగా తొలి సినిమాతో సంచలనాలు సృస్టించారు. అయితే, ఆర్తీ అగర్వాల్‌తో ప్రేమ యవ్వారం బెడిసి కొట్టి కెరీర్‌ని స్పాయిల్ చేసుకున్నాడు తరుణ్.
వరుస ప్లాపులు వెంటాడడంతో హీరోగా కనుమరుగైపోయాడు గత కొంతకాలంగా తరుణ్. ఇక, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడట.
అయితే, సోలో హీరోగా కాదని అంటున్నారు. ఓ స్టార్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడట. ఓ మోస్తరు మల్టీ స్టారర్ మూవీ అంటున్నారు.
సోలో హీరోగా వస్తే సక్సెస్ అవ్వడం కష్టమనుకున్నాడో ఏమో, ఈ మధ్య ఫేమ్‌లో లేని హీరోలు స్టార్ హీరో సినిమాల్లో గెస్ట్ రోల్స్‌తో మంచి పేరు తెచ్చుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం.
లక్కు బాగుంటే, తరుణ్ క్లిక్ అయితే, ఏమో.. సోలో హీరోగా అప్పుడు మళ్లీ క్లిక్ అవుతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







