ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ పై అవేర్ నెస్ క్యాంపెయిన్
- September 02, 2023
బహ్రెయిన్: ఉత్తర గవర్నర్ షేక్ అలీ అబ్దుల్ హుస్సేన్ అల్ అస్ఫూర్ సమాజంలోని సభ్యులను బలోపేతం చేయడానికి, రక్షించడానికి మోసం, ఎలక్ట్రానిక్ ఫిషింగ్ ప్రమాదాలు, పద్ధతులు, రకాలపై అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా అవగాహన పెంచడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మోసం నేరాలను అరికట్టేందుకు సంబంధిత పక్షాలన్నీ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. డిప్యూటీ గవర్నర్ కల్నల్ అబ్దుల్లా మంతర్ సమక్షంలో మానవ వనరుల అభివృద్ధి నిపుణుడు డాక్టర్ మెషల్ నాసర్ అల్ తవాడిని కలుసుకున్న సమయంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. మోసాలపై ప్రజలను అవేరె నెస్ చేస్తున్న డాక్టర్ అల్ తవాడి చేసిన కృషిని కొనియాడారు. ఫిషింగ్ మరియు ఎలక్ట్రానిక్ మోసాల ప్రమాదాల గురించి అవగాహన కల్పించే వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడే విధంగా సంబంధిత అధికారుల సహకారంతో వరుస అవగాహన సెషన్‌లను నిర్వహించడం ద్వారా సహకరించడానికి గవర్నరేట్ సిద్ధంగా ఉందని షేక్ అలీ అబ్దుల్ హుస్సేన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







