సింగపూర్ దేశాధ్యక్ష పీఠం పై భారతీయుడు
- September 02, 2023
సింగపూర్: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి, మాజీ మంత్రి ధర్మన్ షణ్ముగరత్నం చరిత్ర సృష్టించారు. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించినట్లు ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. ఆయనకు పోటీ గా ఉన్న ఇద్దరు చైనా సంతతి వ్యక్తులను వెనక్కి నెట్టి ఆయన విజయం సాధించారు. ఈ త్రిముఖ పోటీలో ఆయనకు 70 శాతం ఓట్లు వచ్చాయని అక్కడి ఎన్నికల విభాగం తెలిపింది. ఈ ఎన్నికల్లో మొత్తం 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ప్రత్యర్థులు ఎంగ్ కోక్సోంగ్, టాన్ కిన్ లియాన్లకు వరుసగా 15.7 శాతం, 13.88శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. థర్మన్ 1957 ఫిబ్రవరి 25న సింగపూర్ లో ఒక తమిళ తండ్రికి, ఒక చైనీస్ తల్లికి జన్మించారు. తండ్రి కనకరత్నం షణ్ముగరత్నం ప్రసిద్ధ పాథాలజిస్ట్, క్యాన్సర్ పరిశోధకుడు, తల్లి గృహిణి. విభిన్నమైన, గొప్ప సాంస్కృతిక వాతావరణంలో పెరిగిన ధర్మన్ ఆంగ్లం, తమిళం, మలయ్, మాండరిన్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ ల నుంచి మాస్టర్స్ డిగ్రీలు పొందారు. థర్మన్ తన వృత్తిని సింగపూర్ సెంట్రల్ బ్యాంక్, ఫైనాన్షియల్ రెగ్యులేటర్ అయిన మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ లో ప్రారంభించారు. సింగపూర్ జీఐసీకి డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో సింగపూర్ కు మార్గనిర్దేశం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







