నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్-1
- September 02, 2023
శ్రీహరికోట: ఆదిత్య ఎల్-1తో పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు శుక్రవారం కౌంట్ డౌన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇవాళ సరిగ్గా 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి ఆదిత్య ఎల్-1ను ప్రయోగించారు. ఆదిత్య ఎల్-1ను లెగ్రాంజ్ పాయింట్ 1 కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అందుకు దాదాపు 125 రోజులు పడుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ ఉంటుంది.
సౌర మండలంలోని గాలులు, కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. అలాగే,సౌర తుపాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు ఫొటోస్పియర్ (కాంతి మండలం), క్రోమోస్పియర్ (వర్ణ మండలం)పై పరిశోధనలు చేస్తారు. ఆదిత్య-ఎల్ 1 ఉపగ్రహం 1,475 కిలోల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







