పోలీస్‌పై హత్యాయత్నం: ఒకరికి జైలు

- May 19, 2016 , by Maagulf
పోలీస్‌పై హత్యాయత్నం: ఒకరికి జైలు

2001లో నువైద్రాత్‌లో పోలీసులపై దాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది సుప్రీం అపీల్‌ కోర్ట్‌. ఈ ఘటనలో మాస్కులు ధరించిన 150 మంది వ్యక్తులు పోలీసులపై ఫైర్‌ బాంబ్స్‌తో దాడికి దిగారు. అదృష్టవశాత్తూ ఈ దాడిలో పోలీసులు ఎవరూ మృతి చెందలేదు, ఎవరూ గాయపడలేదు. అల్లర్లకు పాల్పడటం, అక్రమంగా ఒకచోట గుమికూడడం, ఆస్తులు, ప్రాణాలకు హాని కల్పించేందుకు ప్రయత్నించడం, ఫైర్‌ బాంబ్స్‌ విసరడం వంటి నేరాలకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 17 మందిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com