తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ విజయం..
- May 19, 2016
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ విజయం సాధించారు. తెలంగాణ అధికారపక్షం అంచనాలకు తగ్గట్లే భారీ అధిక్యతను సొంతం చేసుకోవటం గమనార్హం. తొలి రౌండ్ నుంచి తుమ్మల తన అధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించారు.తొలి రౌండ్‌లో 5426 ఓట్ల అధిక్యతతో తన ఖాతాను మొదలుపెట్టిన తుమ్మల రెండో రౌండ్ నాటికి పదివేల అధిక్యతకు దగ్గరకు వచ్చారు. నాలుగో రౌండ్ ముగిసేసరికి 16446 ఓట్ల అధిక్యతలో ఉన్న ఆయన ఆరో రౌండ్ ముగిసేసరికి 20884 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.15వ రౌండ్ ముగిసేసరికి తుమ్మల 41,473 ఓట్ల అధిక్యతలో ఉన్నారు. ఇక.. 16 రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 44050 ఓట్ల అధిక్యతలో ఉన్నారు. లెక్కించాల్సిన ఓట్ల కంటే మెజార్టీ అధికంగా ఉన్న నేపథ్యంలో తుమ్మల విజయం సాధించినట్లైంది. తుమ్మల విజయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







