టాలీవుడ్ మాస్ మహారాజ్ కు జరిమానా

- May 19, 2016 , by Maagulf
టాలీవుడ్ మాస్ మహారాజ్ కు జరిమానా

 టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజకు సిటీ పోలీసులు గురువారం ఝలక్ ఇచ్చారు. ఏపీ 28 డీకే 4742 నంబరు గల కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసి ఉండటంతో జూబ్లిహిల్స్ పోలీసులు ఆపారు. కారులో ఉన్న రవితేజకు.. కారు అద్దాలకు నల్ల ఫిల్మ్ ను ఉపయోగించకూడదని సూచించారు.అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను పోలీసులు అప్పటికప్పుడు తొలగించారు. నిబంధనల ప్రకారం రూ.800 జరిమానా విధించారు. చలానా చెల్లించిన రవితేజ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్రాఫిక్ పోలీసులకు జరిమానా చెల్లించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com