'ఆపిల్ మ్యాప్స్' కేంద్రం హైదరాబాద్‌లో
- May 19, 2016
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ సంస్థ ఆపిల్ మ్యాప్స్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఆపిల్ మ్యాప్స్ కేంద్రాన్ని ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ నగరంలోని వేవ్‌రాక్ భవనంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టిమ్‌కుక్‌తో సమావేశమైన సీఎం, కేటీఆర్ ఐటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. టీఎస్ ఐపాస్, ఐటీ విధాన ప్రతులను టిమ్‌కుక్‌కు ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా టిమ్‌కుక్ మాట్లాడుతూ.. ఐ లవ్ ఇండియా అని సంబోధించారు. భారత పర్యటన చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ప్రారంభిస్తున్నందుకు చాలా ఉద్వేగంగా ఉందన్నారు. ఇక్కడి యువత, నైపుణ్య సామర్థ్యాలు ఆపిల్‌కు ఉపయోగపడుతాయన్నారు.ఆపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు గర్వకారణం : సీఎం హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపిల్ మ్యాప్స్ కేంద్రం ఏర్పాటు తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆపిల్ మ్యాప్ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు. టిమ్‌కుక్, సీఎంతో కలిసి కేటీఆర్ సెల్ఫీ దిగారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ కంప్యూటర్లు, ఆపిల్ వాచ్‌ల మ్యాప్‌ల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్రం కానుంది. నాలుగు వేల మందికి ఆపిల్ హైదరాబాద్ సంస్థలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆపిల్ ద్వారా 5 వేల మందికి ఉపాధి : కేటీఆర్ ఆపిల్ ద్వారా 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఏడాది నాటికి ఆపిల్ సొంత క్యాంపస్‌కు స్థలం కేటాయిస్తామని స్పష్టం చేశారు. డిజిటలైజేషన్లో భాగంగా ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత టాప్-5లో మూడు ఐటీ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకువచ్చామని తెలిపారు. టీ-హబ్‌తో కలిసి పని చేయడానికి ఆపిల్ సిద్ధంగా ఉందన్నారు. అమెరికా వెలుపల హైదరాబాద్‌లోనే ఆపిల్ అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ నెలకొల్పడం సంతోషంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







