ఒమారియాలో ఫిలిపినో హత్య. భారత ప్రవాసుడు అరెస్ట్

- September 04, 2023 , by Maagulf
ఒమారియాలో ఫిలిపినో హత్య. భారత ప్రవాసుడు అరెస్ట్

కువైట్: ఒమారియాలోని ఓ గదిలో ఓ భారతీయుడు ఫిలిప్పీన్స్ జాతీయుడిని హతమార్చిన ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఒమారియా ప్రాంతంలో ఒక హత్య జరిగినట్లు కాల్ వచ్చినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గదిలో ఫిలిప్పీన్స్ దేశస్థుడి మృతదేహాన్ని గుర్తించారు. అదే గదిలో ఉన్న భారతీయుడు కూడా గాయాలతో ఉన్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సంఘటన స్థలం నుంచి వేలిముద్రలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు భారత ప్రవాసుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com