ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు..
- September 04, 2023
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి.తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.అక్టోబర్ 15వ తేదీన ఉత్సవాల తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం,16న శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.
17న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం, 20న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం), 21న శ్రీ దుర్గాదేవి అలంకారం, 22న శ్రీ మహిషా సురమర్ధనీ దేవి అలంకారం, 23న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.
ఆఖరి రోజు సాయంత్రం కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. గతేడాది పది రోజుల పాటు పది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిచ్చారు. అయితే అధిక, నిజ శ్రావణం నేపథ్యంలో తిధులను అనుసరించి ఈ ఏడాది తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమివ్వనుంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







