గార పట్టిన పళ్లు తెల్లగా మారాలంటే, వెల్లుల్లితో ఇలా చేసి చూడండి.!
- September 04, 2023
దంతాలు ఆరోగ్యంగా వుంటేనే మనం ఆరోగ్యంగా వుండగలం. మంచి ఆహారం తీసుకోవాలంటే దంతాలు ఆరోగ్యంగా వుండాలి. అందుకే పళ్ల సమస్యల్ని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
కొందరిలో చిగురు వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు వేధిస్తుంటాయ్. కానీ, వాటిని అలాగే వదిలేస్తుంటారు. అలాగే, దంతాలకు గార పట్టి, నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అయినా పట్టించుకోరు.
ఈ సమస్యలున్నవారు ఖచ్చితంగా వైద్య చికిత్స తీసుకోవాలి. అంతకు ముందే కిచెన్‌లో వుండే సాధారణ పదార్ధాలతో పంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చని సంబంధింత నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లిలో యాంటిబయాటిక్స్ పుష్కలంగా వుంటాయ్. ఇది ఆహారంలో వాడడమే కాదు, పంటి సమస్యల్ని దూరం చేసుకోవడానికి కూడా మంచి దోహదకారి.
నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని కాస్త అటూ ఇటూగా చితక్కొట్టి, అందులో కొద్దిగా బేకింగ్ సోడా, టమాటా రసం కలిపి రెగ్యులర్‌గా యూజ్ చేసే టూత్ పేస్ట్‌తో కలిపి మిశ్రమంలా చేసి బ్రష్‌పై వేసి తోముకోవాలి. ఇలా డైలీ చేస్తే చాలా మంచిది. లేదంటే, వారంలో నాలుగైదు సార్లు చేసినా మంచి ఫలితం వుంటుంది. గార పట్టిన పళ్లు తెల్లగా మారడంతో పాటూ, చిగురు సమస్యలూ నివారించబడతాయ్.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి