ఫైనల్లీ.. బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిపోయిందోచ్.!

- September 04, 2023 , by Maagulf
ఫైనల్లీ.. బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిపోయిందోచ్.!

బిగ్‌బాస్ గేమ్ షో ఎప్పుడు స్టార్ట్ అయినా నెగిటివిటీ వుంటుంది. అయితే, ఈ సారి పెద్దగా అంచనాల్లేకుండా, స్టార్ట్ అవ్వడానికి ముందే ఎటువంటి లొల్లి కూడా లేకుండా బిగ్‌బాస్ షో మొదలైపోయింది.
మరీ పాపులర్ ఫిగర్స్ అని చెప్పలేం కానీ, ఈ సారి బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉల్లా ఫుల్లా.. అంటూ అంచనాలకు తగ్గట్టుగా ఈ సీజన్‌లో ఏదీ వుండదని పదే పదే హోస్ట్ నాగార్జున చెబుతున్నారు. 
అందుకు తగ్గట్లుగానే ఓపెనింగ్ ఎపిసోడ్‌లోనే రకరకరాల ట్విస్టులూ, అన్‌ఎక్స్‌పెక్ట్‌డ్ ఆఫర్లు ఇచ్చి ఒకింత ఎపిసోడ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు బిగ్‌బాస్ నిర్వాహకులు.
హౌస్‌లో ఎటువంటి సదుపాయాలూ లేకుండానే కంటెస్టెంట్లను పంపించారు. విజయ్ దేవరకొండ ద్వారా కొన్ని టాస్క్‌లు ఇప్పించి ప్రాపర్టీస్ తెప్పించారు.
అన్నట్లు ఇంతవరకూ హౌస్‌లో వున్నవాళ్లెవ్వరూ పర్మినెంట్ హౌస్ మేట్స్ కాదనీ, వారి వారి టాలెంట్‌తో వారి స్థానాలను పర్మినెంట్ చేసుకోవాలని నాగ్ చెప్పడం కొసమెరుపు.
14 మంది కంటెస్టెంట్లు ప్రస్తుతానికి హౌస్ లోపలికి వెళ్లారు. వీళ్లలో ఎంత మంది హౌస్‌లో వుండబోతున్నారో, ఇంకెంత మంది కొత్తగా జాయిన్ అవ్వబోతున్నారో ముందు ముందు తెలియాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com