సౌదీ అరేబియాలో సినిమాకు పెరుగుతున్న ఆదరణ
- September 04, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో సినిమా కార్యకలాపాలు పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆదాయం SR535 మిలియన్లకు మించిందని ఆడియోవిజువల్ మీడియా జనరల్ కమిషన్ (GCAM) ప్రకటించింది. ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. సౌదీ విజన్ 2030 లక్ష్యాలను సాధించే లక్ష్యంగా సౌదీ సినిమా రంగం ఈ ప్రాంతంలో అతిపెద్దదని కమిషన్ వెల్లడించింది. 69 సౌదీ సినిమా థియేటర్లలో సీట్ల సంఖ్య 64,000 దాటింది. ఇందులో అత్యంత ప్రముఖమైనవి వోక్స్ సినిమాస్, మువీ సినిమాస్. సౌదీ చలనచిత్రాలు ప్రభావవంతమైన ఉనికిని నిరూపించుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా అమెరికన్ యాక్షన్ డ్రామా చిత్రం "టాప్ గన్: మావెరిక్" నిలిచిందని కమిషన్ వెల్లడించింది. 1.2 మిలియన్ కంటే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడవ్వడంతో SR84 మిలియన్ల ఆదాయం వచ్చిందన్నారు. 2023 రెండవ త్రైమాసికంలో సౌదీ సినిమా రంగం 28 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







