టీటీడీ శిల్పకళాశాలలో మూడు రోజుల సెమినార్ ప్రారంభించిన చైర్మన్ భూమాన

- September 04, 2023 , by Maagulf
టీటీడీ శిల్పకళాశాలలో మూడు రోజుల సెమినార్ ప్రారంభించిన చైర్మన్ భూమాన

తిరుమల: టీటీడీ శిల్పకళాశాలలో మూడు రోజుల సెమినార్ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. కళంకారీ రాష్ట్ర కళగా ప్రకటింపచేస్తానని..30 వేల సంవత్సరాల క్రితమే శిల్పకళ ప్రారంభమైనదని భూమాన కరుణాకర రెడ్డి వెల్లడించారు. కళల్లో శిల్పకళకు చాలా గొప్ప స్థానం ఉందని.. పూర్వం ఉన్నంత గౌరవం ఈ కళకు లేదని వెల్లడించారు. క్రీస్తు పూర్వమే ఆలయాలకు, ప్రార్థనా మందిరాల నుండి ఈ కళ ప్రారంభమైందని..ప్రపంచంలో ప్రతి దేశంలో చరిత్రకు ఆధారభూతమైంది శిల్పకళ అంటూ పేర్కొన్నారు. శిల్పకళ విద్యార్థుల నైపుణ్యం కంటే గొప్పది ఏదీ లేదు…17 సంవత్సరాల క్రితం ఈ కళాశాల దుస్ధితి చూసి సామూహిక మార్పులు చేశానని వెల్లడించారు.

నేను చైర్మన్ గా దిగిపోయే ముందు ప్రతి విద్యార్ధి ద్వారా అర అడుగు,అడుగు మేర శ్రీవెంకటేశ్వర స్వామి ప్రతిమలు తయారు చేయించాలని అనుకున్నానని…ఇన్నాళ్లకు స్వామి వారు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర రెడ్డి. మూడు రోజుల సెమినార్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యతను మరింత పెంచుకోవాలని.. భవిష్యత్తు శిల్పకళాకారులదే కానుందన్నారు.కలంకారిని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కళగా ప్రకటించేలా ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com