ఉద్యోగుల కోసం కొత్త ఎండ్-ఆఫ్-సర్వీస్ బెనిఫిట్స్ సిస్టమ్
- September 05, 2023
యూఏఈ: ప్రైవేట్ సెక్టార్, ఫ్రీ జోన్లలోని ఉద్యోగులు కోసం ఎండ్-ఆఫ్-సర్వీస్ ప్రయోజనాలను పెట్టుబడి పెట్టడానికి కొత్త విధానాన్ని యూఏఈ క్యాబినెట్ ప్రకటించింది. ఈ వ్యవస్థ సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. దీనిని సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ సమన్వయంతో పర్యవేక్షిస్తుంది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. "కార్మికుల పొదుపులను సంరక్షించడం.. వారు సురక్షితంగా పెట్టుబడి పెట్టేలా చూడడమే లక్ష్యం" అని షేక్ మహమ్మద్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకంలో పాలుపంచుకోవచ్చని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. యూఏఈలోని ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు గ్రాట్యుటీని అందుకుంటారు. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం గడిపిన వారు ఈ సేవా ముగింపు ప్రయోజనానికి అర్హులు. యజమానులు తమ కార్మికులను - వారి వృత్తిపరమైన స్థాయిలతో సంబంధం లేకుండా - కొత్త సిస్టమ్‌లో నమోదు చేయవచ్చు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









