తిరుమల వెంకన్నను దర్శించుకున్న షారుఖ్!
- September 05, 2023
తిరుమల: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్, భార్య గౌరీ ఖాన్, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత (TTD) సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుక్‌కు స్వాగతం పలికి స్వామి సేవ, దర్శనం ఏర్పాటు చేశారు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్’ చిత్రం ఈ నోల 7వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జనవరిలో ‘పఠాన్’ చిత్రంతో రికార్డులు సృష్టించిన షారుఖ్ ‘జవాన్‌తోనూ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాకుపై అంచనాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







