బహ్రెయిన్‌లో పెట్ ఫుడ్ స్టోర్స్ వర్సెస్ కోల్డ్ స్టోర్‌లు..!!
- September 06, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో పెంపుడు జంతువుల ఆహారాన్ని విక్రయించే కోల్డ్ స్టోర్‌లు, ప్రత్యేకమైన పెట్ ఫుడ్ స్టోర్‌ల మధ్య పోటీ నడుస్తోంది. తమ వ్యాపారానికి తీవ్ర నష్టం చేస్తున్న కోల్డ్ స్టోర్ లపై చర్యలు తీసుకోవాలని పెట్ ఫుడ్ స్టోర్స్ యజమానులు కోరుతున్నారు. తమ ఉపాధిని దెబ్బతీస్తున్న కోల్డ్ స్టోర్లలో పెట్ ఫుడ్ విక్రయాను పరిమితం చేయడానికి ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే, సౌలభ్యం మరియు యాక్సెస్ సదుపాయాల కారణంగా వినియోగదారులు కోల్డ్ స్టోర్లకు మొగ్గుచూపుతున్నారని వాటి నిర్వాహకులు వాదిస్తున్నారు. హూరాలో పెట్ ఫాంటసీని నడుపుతున్న ఇర్షాద్ ఇష్తియాక్ మాట్లాడుతూ.. అన్యాయమైన పోటీ కారణంగా ఖర్చులు పెరిగి, ఆదాయం లేకపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయని, గత నెలలో BD150 మాత్రమే వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. పెట్ ఉత్పత్తులు వివిధ మార్కెట్‌లు, సాధారణ కోల్డ్ స్టోర్‌లలో సులభంగా లభిస్తున్నాయని, కాబట్టి పెట్ షాప్ యజమానులు అద్దె, విద్యుత్, జీతాలు వంటి ఖర్చులను భరించడం మరియు ఆపై లాభం పొందడం సవాలుగా మారిందని ఆమె వాపోయారు. పెరుగుతున్న ఖర్చులు మరియు అన్యాయమైన పోటీ కారణంగా తగినంత ఆదాయం లేకపోవడంతో అనేక పెట్ ఫుడ్ దుకాణాలను మూసివేయవలసి వచ్చిందని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







