85 లక్షల బంగారం తీసుకెళ్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు
- September 06, 2023
కువైట్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో సోమవారం కువైట్ నుంచి బంగారం తీసుకెళ్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు.
మొదటి కేసులో కువైట్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడిని అడ్డగించగా, విమానం నుండి దిగిన వెంటనే పురుషుల టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో రూ. 75,80,650 విలువ చేసే 1253 గ్రాముల బంగారాన్ని రహస్యంగా దాచినట్లు తేలింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.
రెండవ కేసులో కువైట్ నుండి వచ్చిన మరొక ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. వారి చెక్-ఇన్ బ్యాగేజీని స్కాన్ చేయగా, వారి లగేజీలో కట్ ముక్కలుగా దాచిపెట్టిన 151 గ్రాముల బంగారం (విలువ రూ.9,16,570)ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







