‘జవాన్’ హిట్.! బలవంతంగా ఒప్పిస్తున్నారా.?
- September 07, 2023
కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజు (సెప్టెంబర్ 7) ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘పటాన్’తో ఫామ్‌లోకి వచ్చిన షారూఖ్ ఖాన్ రెట్టించిన కాన్ఫిడెన్స్‌తో ‘జవాన్’ సినిమా చేశారు.
అదే ఉత్సాహంతో సినిమాని బాగా ప్రమోట్ చేశారు కూడా. మంచి బజ్ క్రియేట్ అయ్యింది రిలీజ్‌కి ముందే ‘జవాన్’పై. సౌత్ క్వీన్ నయన తార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం విశేషం.
అలాగే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్ పోషించారు. అయితే, ఫస్ట్ షోకి మంచి టాక్ వచ్చింది. ఈ పాజిటివ్ టాక్‌తో సినిమా హిట్టూ, సూపర్ హిట్టూ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
‘పటాన్’ హిట్‌ని ‘జవాన్’తో షారూఖ్ ఖాన్ కొనసాగించాడు.. అంటూ బాలీవుడ్ వర్గాలు సంబరపడిపోతున్నాయ్. ఎంత ప్రయత్నించినా ఒక్క హిట్టు కూడా కొట్టలేక బాలీవుడ్ ఈ మధ్య తెగ సతమతమవుతోంది.
ఆ టైమ్‌లోనే ‘పటాన్’తో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు ‘జవాన్’ కూడా ఇంకాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. అయితే, సినిమాలో అంత విషయం లేదు. బలవంతంగా ‘జవాన్’ని హిట్టు లిస్టులో పడేస్తున్నారన్న ప్రచారం మరోవైపు వినిపిస్తోంది. చూడాలి మరి, ఈ వీకెండ్ రాబోయే సినిమాలను తట్టుకుని ‘జవాన్’ నిలబడగలిగితే, హిట్టు అని అఫీషియల్‌గా ఒప్పుకోవచ్చేమో.! మరో మూడు రోజులు ఆగితే కానీ, ఆ విషయం తేలేదే లే.!
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







